- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మాయి ఇంట్లో మృతదేహం ఉంచి గ్రామస్తుల నిరసన..
దిశ, చండూరు : మండల పరిధిలోని తాస్కాని గూడెంలో శనివారం రాత్రి తీవ్రఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్బనబోయిన శివ అదేగ్రామనికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. దాంతో యువతి కుటుంబ సభ్యులు షీటీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కౌన్సిలింగ్ పేరిట పిలిచి విపరీతంగా కొట్టారని దీనితో మనస్తాపం చెందిన శివ మంగళవారం తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసాడన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొడలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యంకోసం హైద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం శివ మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం మృతుని స్వగ్రామమైన తాస్కాని గూడం గ్రామానికి బారి బందోబస్తు మధ్య మృతదేహాన్నీ తీసుకువచ్చారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకపోయే క్రమంలో గ్రామస్తులకు, పోలీస్ లకు మధ్య తీవ్రతోపులాట జరిగింది. కోపోద్రేకులైన గ్రామస్తులు మృతదేహాని యువతి ఇంట్లో పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మృతుని చావుకు కారణమైన షీటీం సీఐని సస్పెండ్ చేసి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకు మృతదేహాన్నీ తీసేది లేదని గ్రామస్తులు తెలిపారు.