- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామాలయం పై రాజకీయం..
దిశ,నేరేడుచర్ల /హుజూర్‌నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలోని కరక్కాయల గూడెంలోని పురాతనమైన సుమారు 100 సంవత్సరముల చరిత్ర గల రామాలయం పై ఆ గ్రామంలో రాజకీయం చోటుచేసుకుంది. పురతనమైన దేవాలయం అయినప్పటికీ చాలా చిన్నది కావడంతో దాని స్థానంలో నూతన ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు దాతలతో పాటు గ్రామస్తులు కూడ తమ వంతు విరాళాల ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇందులో రెండు వర్గాలుగా చేరి తాము చెప్పిందే నడవాలన్నట్టుగా ఒకరికొకరు పోటీ పడుతుదాడులకు దిగుతున్నారు.
ఆధిపత్యం కోసమే నిర్మాణంలో అడ్డంకులు..
రామాలయం గుడి ఏర్పాటు విషయంలో గ్రామంలో రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. పురాతన దేవాలయమైన రామాలయాన్ని ఇప్పుడే కూల్చవద్దని ఒక వర్గం వారు అంటే.. ఇప్పుడే కూల్చి వేయవద్దని శ్రావణ మాసంలోనో కార్తీక మాసంలోనో కూల్చి అప్పుడే నిర్మాణం చేపట్టాలని, మరో వర్గం వారు అనడంతోనే సమస్య ఏర్పడింది. ఇందులో ఆధిపత్యం కోసం తమ మాట నెగ్గాలనే ఉద్దేశంతో ఒకరి పై ఒకరు తగాదాలకు దిగుతున్నారు. వీటికి రాజకీయం తోడుకావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక వర్గానికి మద్దతిస్తే.. మరొకరు కాంగ్రెస్ పార్టీ మారడంతో రాజకీయంగా మారి ఒకరికొకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి చేరుకుంది. అయితే ఇప్పుడే కూల్చివేసి నిర్మాణం చేపడదాం అనే వారికి వారికి అధికార పార్టీ సర్పంచ్ భర్త మద్దతు ఇవ్వగా.. శ్రావణమాసం కానీ కార్తీక మాసంలో మంచి రోజులు చూసి కూల్చివేసి అప్పుడే గుడి నిర్మాణం చేపట్టాలన్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ఇస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్న వైనం..
గుడి కూల్చివేసి నిర్మాణం జరపాలని గత రెండు రోజుల క్రితం గుడిని కూల్చివేంచేందుకు అధికార పార్టీ మద్దతుదారులు ప్రయత్నం చేశారు. దానిని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఒక్కరి పై ఒకరు దాడులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గం తాము గుడి కూల్చివేతకు కొత్తగుడి నిర్మాణానికి వ్యతిరేకం కాదని మంచి రోజులు చూసి నిర్మాణం చేపట్టాలని కోరుతూన్నారు.
గుడి విషయంలో పోలీసుల జోక్యం ఏంటి.. ఎంపీ ఉత్తమ్
గుడి విషయంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసుల పై పైర్ అయ్యారు. 100 ఏళ్ల నాటి రామాలయం ఆలయాన్ని కూల్చివేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసుల మద్దతును ప్రతిపాదిస్తున్నారని నాకు చాలాసార్లు ఫోన్‌లు వస్తున్నాయి. పురాతన దేవాలయం కూల్చివేత పై నిర్ణయం తీసుకునే అధికారం గ్రామపంచాయతీ లేదా ఎమ్మెల్యేకు సంబంధమేందని ప్రశ్నించారు. ఆలయాన్ని కూల్చివేయడానికి పోలీసుల సహకారం అందించవద్దని ఎంపీ ఉత్తమ్ హుజూర్‌నగర్ సీఐని కోరారు. ఇదే విషయాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్ళేట్టు తెలిపారు.