- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల సిత్రాలు ఎన్నెన్నో.!
దిశ, కోదాడ టౌన్: తానే గెలవాలని ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ ఇదేం విచిత్రమో గాని తనతో పాటు పోటీ చేసేందుకు మరో ముగ్గురు అభ్యర్థులకు నామినేషన్ ఖర్చు తానే భరిస్తానని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి అంటున్నారు. అదేంటో చూద్దాం పదండి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు తానే నామినేషన్ ఖర్చు భరిస్తానని కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ జలగం సుధీర్ 'దిశ' కు తెలిపారు. ఈ విషయమై తాను రెండు వారాల క్రితం ప్రకటన జారీ చేశానని, 15 మంది యువకులు దరఖాస్తు చేసుకున్నారని, వారి నుంచి ముగ్గురిని ఎంపిక చేశామని ఆయన తెలిపారు. వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులున్నారని ఆయన అన్నారు. ఏంటండీ విషయం అని 'దిశ' ఆయనను ప్రశ్నించగా పోటీ చేయాలని ఉన్నా నామినేషన్ ఖర్చు భరించలేని విద్యావంతులైన యువత ఎందరో ఉన్నారని, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందంటూ అందుకే తన ఈ ప్రయత్నం అన్నారు. నామినేషన్ ఖర్చు సరే.. ఎన్నికల ప్రచార ఖర్చు కూడా మీరే భరిస్తారా అని పలువురు సెటైరికల్ గా అంటున్నారు.