- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షానికి రోడ్డు పూర్తిగా డామేజ్..
దిశ, నేరేడుచర్లః రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నేరేడుచర్ల మండలంలోని గంట వారి గూడెం నుండి నేరేడుచర్ల మండల కేంద్రానికి వెళ్లే రహదారిపై ఏర్పాటు చేసిన కాలవపై గూనులతో వేసిన రోడ్డు డ్యామేజ్ అయింది. పంట పొలాలకు వెళ్లే రైతులతో పాటు ఈ రోడ్డు ద్వారా గంట వారి గూడెం, తెలగ రామయ్య గూడెం గ్రామాల ప్రజలు నిత్యం నేరేడుచర్ల వెళ్తుంటారు. ఈ రోడ్డు డ్యామేజ్ కావడంతో అ మార్గంలో వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఏ చిన్నపటి వర్షం వచ్చినా ఆ రోడ్డుపై వేసిన గునాలలో చెత్త చెదారం ఇరుక్కొని పోయి రోడ్డుపై ఆ పంట పొలాలతో పాటు ఎన్ఎస్పీ కాలవనీరు ప్రవహించి రోడ్డు పూర్తిగా దెబ్బతింటుందని గ్రామస్తులు తెలిపారు. వర్షం వచ్చినప్పుడల్లా అక్కడ కల్వర్టు సరిగా లేకపోవడంతో ఇలా వరద ప్రవానికి తరచూ రోడ్డుకు డ్యామేజ్ అవుతుందని తెలిపారు. ఈ రోడ్డు ఇప్పటికే తారు రోడ్డు శాంక్షన్ అయి ఉంది. ఇక్కడ గూనలు తీసేసి పెద్ద కల్వర్టు ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారం జరుగుతుందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఈ డ్యామేజ్ అయిన రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుకుంటున్నారు.