- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్.. ఆ 7 వేల గజాల భూమి రిజిస్ట్రేషన్ రద్దు
దిశ, భూదాన్ పోచంపల్లి: పోచంపల్లి పరిధిలోని శ్రీ మిత్ర టౌన్షిప్ వెంచర్ లో భాగమైన సాయి సౌదా లేఅవుట్లో 10 శాతం ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతమైన 7 వేల గజాల పోచంపల్లి మున్సిపాలిటీ భూమి రిజిస్ట్రేషన్ రద్దు అయినట్లు విశ్వసనీయ సమాచారం. గత నెల 19న పోచంపల్లి మున్సిపాలిటీ భూమికి ఎసరు అనే శీర్షికతో దిశ వార్త కథనం ప్రచురించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అఖిలపక్ష నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు,ఆందోళనలు నిర్వహించారు. వివిధ పార్టీల జిల్లా రాష్ట్ర,స్థాయి బడా నాయకులు క్షేత్ర పరిశీలన చేసి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరికల చేశారు.
అధికార ప్రజా ప్రతినిధుల అండదండలతో మొత్తం ఈ తంతు నడిచిందని పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగి చిలికి చిలికి గాలివాన అయినట్లుగా విషయం ఎమ్మెల్యే, కలెక్టరు దృష్టికి వెళ్లింది.మున్సిపల్ కమిషనర్ కూడా బదిలీ అయ్యారు.దీంతో నిజానిజాలను తేల్చేందుకు కలెక్టర్ విచారణకు ఆదేశించగా జూన్ 3న అన్యాక్రాంతం అయ్యి ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినట్లు సోమవారం దిశకు సమాచారం అందింది.భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరు పై ఉన్న డాక్యుమెంట్ నెంబర్ తో ఈసీలో గమనించగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినట్లు చూపుతోంది. గతంలో చెత్త వేసి డంపింగ్‌గా మార్చిన స్థలమే ప్రభుత్వ స్థలం అని ఇప్పుడు నిర్ధారణ అయినట్లు అయింది.
ప్రభుత్వానికి కేటాయించిన వెంచర్ లే అవుట్ లో కేటాయించిన ఖాళీ భూముల్లో ఎవ్వరూ క్రయవిక్రయాలు చేయకూడదని రిజిస్ట్రేషన్ రద్దు యొక్క సారాంశం.దీంతో అఖిలపక్ష సమర్థ నాయకులు, ప్రజలు, వివిధ సంఘాల నేతలు ప్రభుత్వ ఆస్తులను కాపాడినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా గతంలో 10 శాతం భూములను, ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రజాప్రతినిధులపై అధికారులపై ఉందని పలువురు నేతలు ప్రజలు అంటున్నారు. శ్రీ మిత్ర టౌన్షిప్ వెంచర్ లో బై నంబర్లతో వేసిన 683/p,708/p,709/p,710/p,738/p,739/p,711/p,716/p,734/p,735/p,736 సర్వే నెంబర్లలోని సాయి సౌదా( ఎక్స్టెన్షన్ ఆఫ్ శ్రీ మిత్ర టౌన్ షిప్ )వెంచర్‌లొ మున్సిపల్‌కు కేటాయించిన ఖాళీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల నుండి తిరిగి స్వాధీన పరుచుకున్నది ఈ స్థలమే.