- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపాలిటీలో అన్ని సమస్యలే..
దిశ, నేరేడుచర్ల : మున్సిపాలిటీలో అన్ని సమస్యలు ఏర్పడ్డాయని ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా చైర్మన్, కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని విపక్ష కౌన్సిలర్ల సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని, విపక్ష కౌన్సిలర్లు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ముందు తమ బాధలను వివరించుకున్నారు. శనివారం నేరేడుచర్ల మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. సరైన సమయానికి కౌన్సిల్ సభ్యులు చైర్మన్ జయబాబుతో పాటు మరో కౌన్సిలర్ మాత్రమే హాజరు కావడంతో ఫోరం లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వాయిదా వేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మున్సిపాలిటీలోని అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ ముగించుకొని వెళ్తున్న ఆయనను విపక్ష పార్టీ కౌన్సిల్ సభ్యులైన కొణతం చిన వెంకటరెడ్డి , బచ్చలకూరి ప్రకాష్ , రణపంగ నాగయ్య , బైరెడ్డి జితేందర్ రెడ్డి ,నూకల సుగుణమ్మ , కొదమ గుండ్ల సరిత లు అడ్డగించి మున్సిపాలిటీలో జరుగుతున్న సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. మున్సిపాలిటీ ఏర్పడ్డ దగ్గర నుంచి మున్సిపాలిటీ పరిధిలో 40 నుంచి 45 వెంచర్లు వేశారని ఏ ఒక్క దానికి మున్సిపాలిటీకి ఎంత స్థలం కేటాయించారో తెలియజేయలేదని తెలిపారు.
మున్సిపాలిటీలో డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయని తెలిపారు.నేరేడుచర్లలో గ్రామపంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు ఉన్న పారిశుద్ధ్య సిబ్బందే ఉన్నారని కానీ వార్డుల సంఖ్య జనాభా సంఖ్య పెరిగిందని దానికి తగ్గట్టుగా మున్సిపాలిటీ సిబ్బందిని కేటాయించాలని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపాలిటీలో కనీసం పాలకవర్గ బోర్డును చేయలేదని అలాగే మున్సిపాలిటీలో స్వాగతం బోర్డును కూడా ఏర్పాటు చేయలేదని ఇంత దుస్థితి ఈ మున్సిపాలిటీ ఏర్పడేదని తెలిపారు. ప్రతి సమావేశంలో కంప్యూటర్ కొంటున్నామని తీర్మానం చేసి డబ్బులు డ్రా చేస్తున్నారే తప్ప కంప్యూటర్ కొనేది లేదని అలాగే ట్రీ గార్డులు వేయకుండానే డబ్బులను డ్రా చేశారని ఆరోపించారు. ఎజెండా నిర్వహించే సమయంలో కనీసం సభ్యుల వివరాలను ఏమాత్రం పరిగణము తీసుకోవట్లేదని ఆయనకు వివరించారు. ప్రతి నెల సమావేశం నిర్వహించి ఆ సమావేశానికి విలేకరులను లోపలికి ఆహ్వానించే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్.