MLA : గోదాంను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

by Naveena |
MLA : గోదాంను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
X

దిశ ,దేవరకొండ : మండల స్థాయి గిడ్డంగి గోదాంను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్( MLA Nenawat Balu Naik )ఆకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణి లో అవకతవకలకు అవకాశాలేని విధంగా రేషన్ దుకాణాలలో వేలిముద్రల (ఇ పాస్) కంటి స్కానర్ (ఐరిస్) ద్వార తమ కోటాను రేషన్ కార్డుదారుడు మద్దతు ధరలకు రేషన్ సేకరించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవరకొండ నియోజక వర్గంలోని తెలంగాణ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడి సెంటర్ ,పాఠశాలలకు మధ్యాహ్న భోజన పధకంలో సన్న బియ్యం జారీచేయడం జరిగిందన్నారు. నల్ల మార్కెటింగ్, వైవిధ్యాలు మొదలైన వాటిపై ఎప్పటికప్పుడు గోదాం ను పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. అనంతరం గోదాం హమాలీల సమస్యలు అడిగి తెలుసుకొని..సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి, చైర్మన్ డాక్టర్ వేణుదర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కిన్నెర హరికృష్ణ, డి టి సి ఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్, డీలర్ కొర్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన పిఏ పల్లి మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గత ప్రభుత్వం రాజకీయాలతోనే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, నూతన పెన్షన్ లబ్ధిదారుల ఎంపిక తో పాటు..అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో పిఏ పల్లి మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్,నాగభూషణం,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, డైరెక్టర్ గోవర్ధన్ రావు,పార్టీ నాయకులు చంద్ర రెడ్డి,జానకిరామ్ రెడ్డి,సింగం వేంకటేశ్వర్లు,సైదులు,నరేష్ రెడ్డి,ఎంపీటీసీ మంజుల మోతిలాల్ నాయక్,రమేష్ నాయక్, లోక్యా నాయక్,యువజన విభాగ నాయకులు సాయి రాథోడ్, సుభాష్ నాయక్ ,రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed