- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
దిశ,తుర్కపల్లి: తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రంలోని ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలంచారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యంను ఎక్కడ కూడా దాళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరకే అమ్ముకోవాలని రైతుల కు సూచించారు. సన్నా బియ్యంన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి ప్రభుత్వ ప్రత్యేకంగా ఇస్తున్న రూ.500 సబ్సిడీ పొందాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన కార్యక్రమంలో ఇన్యుమరేటర్ లు అడిగిన పత్రాలు ఇచ్చి ప్రజలు సహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సురేష్, తహసిల్దార్ దేశ్య నాయక్, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి,ఆర్ ఐ జహంగీర్, పంచాయతీ కార్యదర్శి శైలజ,ఏఈఓ దివ్య, రైతులు పాల్గొన్నారు..