- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ministers : విద్యుత్ రంగంలో తెలంగాణ తలమానికం
దిశ,మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త విద్యుత్ పాలసీతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విద్యుత్ రంగంలో తలమానికంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క( Deputy Chief Minister )అన్నారు. ఆదివారం దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో చేపడుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy,) ఉత్తంకుమార్ రెడ్డిUttamkumar Reddy)లతో కలిసి సందర్శించారు. ప్లాంటు ట్రయల్ రన్ మెషిన్ ఆన్ చేయడంతో పాటు.. బొగ్గును సరఫరా చేసే రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2025 మే నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తిచేసుకుని విద్యుత్ తయారీ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పవర్ ప్లాంట్ పనులు ప్రారంభమైతే నాలుగువేల మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పవర్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని 2028-29 సంవత్సరం నాటికి 2488 మెగావాట్లు, 2034-35 సంవత్సరం నాటికి 31809 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉన్నట్లు అధికారకంగా అంచనా వేసినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యుత్తును పెంచడంతో పాటు.. రాష్ట్ర అభివృద్ధికి,వ్యవసాయానికి,పారిశ్రామిక రంగానికి,గృహ అవసరాలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి పరిస్థితులకు అనుగుణంగా నాన్ కన్వెన్షన్ విద్యుత్ ను తీసుకురావడంతో.. మరో 20 వేల మెగావాట్ల విద్యుత్ ను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. త్వరలోనే ఉన్నతాధికారులు, అనుభవజ్ఞులైన మేధావులతో కొత్త విద్యుత్ పాలసీని తీసుకువచ్చి చట్టసభల ద్వారా అమలు అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొత్త విద్యుత్ పాలసీతో మల్టీనేషన్ కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా పాలసీ విధానం ఉంటుందని అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మోడల్ స్టేట్ గా మారనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ త్రిపాటి, డైరెక్టర్ అజయ్ కుమార్, జెన్కో, బిహెచ్ఇఎల్ అధికారులు, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు