battalion police : బెటాలియన్ పోలీసుల సస్పెన్షన్ ఎత్తివేత..

by Sumithra |
battalion police : బెటాలియన్ పోలీసుల సస్పెన్షన్ ఎత్తివేత..
X

దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఉన్న 12వ తెలంగాణా రాష్ట్ర బెటాలియన్ లో ( battalion police ) పని చేస్తున్న పోలీసులను ఉన్నత అధికారి ఆఫీస్ కమాండింగ్ ఆరుగురుని సస్పెండ్ ( Suspension ) చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ చేయడనికి గల కారణం ఏమైనా ఉందా అంటే వారి భార్యలు ధర్నా చేశారు, అందుకే సస్పెండ్ చేస్తున్నాం అని వారిని చేసినట్లు తెలిపారు. కానీ ధర్నాలో వందల మందికి పైన బెటాలియన్ పోలీసుల భార్యలు వారి భర్తల పని భారం తగ్గించాలని, కామన్ మెస్ ( Common Mess ) తీసివేయలని, రూల్ కాల్ వ్యవస్థను సివిల్ ఆర్ ( Civil R ) మాదిరిగానే పెట్టాలని కొత్తగా వచ్చే రికార్డు పద్ధతి ఉపసంహరణ చేసుకోవాలని, బెటాలియన్ ముందు వారి కుటుంబ సభ్యులు ధర్నా అలాగే రాస్తారోకో నిర్వహించారు.

దీనితో పెద్ద ఎత్తున కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సీరియస్ అయిన బెటాలియన్ ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసుల మీద సస్పెండ్ ఆర్డర్లు ఇచ్చారు. వారిని సస్పెండ్ చేసినందుకు పోలీసులు అందరూ మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధం అయ్యారు. దీని పై వెంటనే దిగివచ్చిన పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ కి గురి అయిన పోలీసులు రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, వినోద్ కానిస్టేబుల్, సురేష్ కానిస్టేబుల్, నర్సింగ్ హెడ్ కానిస్టేబుల్, నాగరాజు కానిస్టేబుల్, అష్రఫ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ ఆర్డర్ ఎత్తివేస్తున్నట్లు కాపీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed