- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
దిశ ఎఫెక్ట్.. స్పందించిన సూర్యాపేట ఆర్టీసీ అధికారులు..
by Sumithra |
X
దిశ, తుంగతుర్తి :“దిశ” కథనానికి సూర్యాపేట ఆర్టీసీ డిపో అధికారులు స్పందించారు.“విచిత్రంగా మారిన సూర్యాపేట ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి” అనే టైటిల్ పై “వెబ్”లో ఈ నెల 22 సాయంత్రం వివరంగా కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ సురేందర్ బుధవారం రాత్రి తుంగతుర్తి “దిశ”తో ఫోన్ ద్వారా మాట్లాడారు. బస్సుల రద్దు విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బస్సులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. తుంగతుర్తి-హనుమకొండ బస్సు పునరుద్ధరణ విషయాన్ని కచ్చితంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. గతంలో మానాపురం, గొట్టిపర్తి గ్రామాలకు వేసిన సర్వీసులతో ఆయా ప్రాంతాల ప్రయాణికుల నుండి అంతగా ఆదరణ లభించలేదని పేర్కొన్నారు.
Advertisement
Next Story