- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suryapet Collectorate: వేధింపులకు గురి చేస్తున్న అధికారిపై చర్యలేవి..?
దిశ, కలెక్టరేట్ సూర్యాపేట: సూర్యాపేట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వివాదాలకు నిలయంగా మారుతోంది. అధికారుల వేధింపులకు తాళలేక మహిళ ఉద్యోగులు ఫిర్యాదు చేయగా.. పట్టించుకునే అధికారులే లేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాఖా పరమైన చర్యలు చేపట్టిన ఆ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను జిల్లా అధికారులు భేఖాతార్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేధించే వ్యక్తిపై విచారణ...!
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పని చేస్తున్న మహిళల ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తుండడంతో ఫిబ్రవరి నెలలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు ఫిర్యాదుపై స్పందించి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల అదేశాలు జారీ చేశారు. జిల్లా మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్యమైన ముగ్గురు జిల్లా అధికారులతో కమిటీ వేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు. ఆ వెంటనే ఆయన బదిలీపై వెళ్లారు. డీడబ్ల్యూవో (DWO) నేతృత్వంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షణలో విచారణ జరిపి మహిళ ఉద్యోగులపై వేధింపులు వాస్తవమేనని తేల్చారు. ఎంక్వైరీ రిపోర్ట్‌ను జిల్లా కలెక్టర్‌కు అందించగా అట్టి రిపోర్టుపై ఇద్దరు అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఆర్డీవో, డీడబ్ల్యూవో నలుగురు పర్సనల్ హియరింగ్ చేసి వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
విచారణ సరే.. మరి చర్యలేవి..
మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఉద్యోగిపై శాఖ పరమైన చర్యలు తీసుకున్న హెడ్ ఆఫీస్‌కు సరెండర్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, అతడు సరెండర్ కాకుండా సదరు ఉద్యోగి అంగబలం, అర్థ బలంతో చక్రం తిప్పుతున్నారని ఆ శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా ఆరోపణలు చేశారు. దీంతో ‘దిశ’ పత్రికలో డోంట్ కేర్..! వార్త ప్రచురించడంతో కమిషనర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌కి మే 24న సరెండర్ చేసినట్లు పేపర్ ప్రకటన చేశారు. కమిషనర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సరెండర్ ఆర్డర్‌ను రిజెక్ట్ చేస్తూ లెటర్ తిరిగి పంపించారు. అతడిపై వచ్చిన ఆరోపణలకు చేసిన తప్పులకు ఖచ్ఛితంగా చర్యలు తీసుకుని రిపోర్ట్ పంపాలని లెటర్ పూర్వకంగా తెలియజేయశారు. కానీ, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సదరు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ విషయంలో జిల్లా అధికారులు కాలయాపన చేస్తువస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒత్తిళ్లు తట్టుకోలేక బదిలీ..
ఆరోపణలు వచ్చిన అధికారులు, సిబ్బందిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోవద్దని డీఆర్డీవోపై విపరీతమైన ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. వాటిని తట్టుకోలేకే సెలవుపై వెళ్లినట్లుగా తెలుస్తోంది. సదరు డీఆర్డీవో ఇక్కడ పని చేయలేనని, బదిలీ కోసం తన ప్రయత్నాలు షురూ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది ఇలా ఉంటే మహిళలను వేధించాడని ఆరోపణలు వచ్చిన అధికారిని కాపాడేందుకు కొంతమంది ఉద్యోగ జేఏసీ సంఘాల నాయకులు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.