- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫీజులు ఫుల్.. వసతులు నిల్ !
దిశ, నల్లగొండ బ్యూరో //సూర్యాపేట టౌన్: కళాశాల విద్యార్థినులకు రక్షణ కరువైంది. ఫీజుల మత్తులో పడి విద్యార్థినులను సరిగ్గా పట్టించుకోవడం లేదు. విద్యార్థినులకు చదువు చెప్పాల్సిన కళాశాల యాజమాన్యం తీరు ఆత్మహత్య చేసుకోవడానికి కేంద్రంగా మారుతుంది. యాజమాన్యం ఫీజులో రాబడి చూసుకుంటున్నారే తప్ప విద్యార్థినులకు భద్రత కల్పించడం లేదు. కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం విద్యార్థినుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. చదువు పక్కన పెడితే కనీసం విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతుంది. ఇందుకు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్నేహ నర్సింగ్ కళాశాల నిదర్శనం అవుతుంది. వేలకు వేలు ఫీజులు కట్టి విద్యార్దినులను కళాశాలలో చేర్పిస్తే ఆ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు దూరం చేస్తుంది. కన్ను మూసినా.. తెరిచిన ఆ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే అనుక్షణం తలుచుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం అస్సాం రాష్ట్రానికి చెందిన ఆదే కళాశాలలో చదువుతున్న విద్యార్థిని శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కళాశాల విద్యార్థినుల తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేసింది.
వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్నారు తప్ప మాకు చదువు చెప్పడం లేదని, అలాగే రక్షణ కల్పించడం లేదని వేధింపులకు గురి చేస్తున్నారని స్నేహ నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు రెండు రోజులుగా జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ తమ గోడును అధికారులకు వెళ్లబుచ్చుకుంటున్నారు.
కనీస వసతులు లేవు..
స్నేహ నర్సింగ్ కళాశాలలో కనీస వసతులు లేవనీ, క్లాస్ రూమ్ సరిగ్గా ఉండదనీ క్లాస్ రూమ్ కి డోర్లు కూడా లేవనీ, ల్యాబ్ అంటారే తప్ప అక్కడ ల్యాబ్ కనిపించదనీ ఆ కళాశాల విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు.
లైబ్రరీ కూడా లేదనీ, వెహికల్ కూడా ఉండదనీ, రెండు సంవత్సరాల నుండి తమ ప్రిన్సిపల్ ఎవరో తమకే తెలియదని ఆ కళాశాల విద్యార్థినులు మీడియా ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
బాత్రూం ముందు సీసీ కెమెరాలు ఉంటాయనీ తాము బాత్రూం వెళ్లాలన్న చాలా ఇబ్బందికరంగా ఉందనీ, భోజనం సరిగ్గా ఉండదనీ వారు అన్నారు. తమకు సరైన భోజనం పెట్టండి అని కళాశాల యాజమాన్యానికి విన్నవించుకున్న వారు ఏమాత్రం పట్టించుకోక పొగా అసభ్యకరమైన మాటలు మాట్లాడతారని ఆ కళాశాల విద్యార్థినులు వాపోయారు.
ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విద్యార్థిని
అస్సాం రాష్ట్రానికి చెందిన నర్గెస్ పర్బిన్ అనే యువతి అదే కళాశాలలో రెండవ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతుంది. కళాశాలలో ఫీజు వేధింపులతో యాజమాన్యం అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని, ఎదురు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని కళాశాలలో సూసైడ్ నోట్ రాసి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రికి వార్డెన్ తీసుకొని వెళ్లారు తప్ప యాజమాన్యం మాత్రం పత్తా లేకుండా పోయారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేధింపులకు గురి చేస్తున్నారు.. దివ్య జ్యోతి సెకండ్ ఇయర్ స్టూడెంట్..
కళాశాలలో కనీస వసతులు లేవని, భోజనం సరిగ్గా పెట్టడం లేదని తమ యాజమాన్యానికి తెలిపితే తమను అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్నారంటున్నారు. ప్రాక్టికల్స్ మార్క్స్ కట్ చేస్తామని, ఎక్కువ మాట్లాడితే టీసీ ఇచ్చి పంపిస్తామని మీ భవిష్యత్తును నాశనం చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారన్నారు. కళాశాల యాజమాన్యం ఇబ్బంది పెట్టడంతో రెండు రోజుల క్రితం ఒకేసారి 25 మంది విద్యార్థులం తమ గోడు ని అధికారులకు చెప్పుకుందామని బయటికి వెళ్ళాం అన్నారు. ఎటు వెళ్ళామో కనీసం తెలుసుకోకుండా తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమపై అసభ్యకరమైన మాటలు చెప్పడం మమ్మల్ని కలిచి వేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా గోడును విని మాకు వెంటనే న్యాయం చేయాలని కోరుతున్నాం అని కోరారు. తమకు దగ్గరలోనే పరీక్షలు ఉన్నాయి తమతో ఇంతవరకు పరీక్ష ఫీజు కూడా కట్టించు కోలేదు. దయచేసి మాకు న్యాయం చేసి మేము పరీక్షలు రాసేలా చూడాలనీ, అలాగే మా కళాశాలలో కనీస వసతులు ఉండేలా చూడాలని అధికారులను కోరుతున్నాం.
విచారణకు ఆదేశించాం.. పి. రాంబాబు. అదనపు కలెక్టర్
కోదాడ పట్టణంలోని స్నేహ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. ఇప్పటికే ఆర్డిఓ కి, డిఎంహెచ్ఓ ని విచారణకు ఆదేశించాం. విద్యార్థులను వేధింపులకు గురి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. నర్సింగ్ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తాం.