- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెనూ పాటించకపోతే కఠిన చర్యలుః ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్
దిశ, మిర్యాలగూడ : విద్యార్థులకు అందించే భోజన మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్ హెచ్చరించారు. శనివారం మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామంలోని ఎస్టి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. రికార్డు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డైనింగ్ హాల్ ను పరిశీలించి, విద్యార్థులను మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాసీరకం కూరగాయల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకొని సంబంధిత కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఆయన వెంట ఆర్ సి ఓ ఆగస్తిన్, ప్రిన్సిపల్ అజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ కుతుబుద్దీన్ తదితరులున్నారు.