- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను దోచుకుంటున్న ఐకేపీ సెంటర్లు..
దిశ, తుంగతుర్తి : రైతులను ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు దోచుకుంటున్నారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కంబాల శ్రీనివాస్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఏర్పాటైన ఐకేపీ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రతినిధి బృందం శనివారం సందర్శించింది. కేంద్రంలో తూకాలు వేసి లారీలోకి లోడ్ చేస్తుండగా ప్రతినిధి బృందం కొన్ని బస్తాలను దించి మళ్లీ తూకాలు వేసింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని బస్తాలు 43, మరికొన్ని 42,500 కిలోల చొప్పున ఉన్నాయని వివరించారు. అంతకు ముందు రోజు బస్తాలను తూకం వేయగా ఒక్కొక్క బస్తా 46 నుంచి 47 కిలోలు ఉన్నట్లు తెలిపారు.
ఫలితంగా బస్తాకు 6 నుంచి 7 కేజీలు అదనంగా తూకం వేసి రైతుల్ని మోసం చేస్తున్నారని దుయ్యబడ్డారు. ముఖ్యంగా బస్తాతో కలుపుకొని 40 కేజీల 300 గ్రాముల నికర తూకం వేయాలని ఆయన వివరించారు. ఆరుగాలం శ్రమించిన రైతాంగాన్ని నిట్ట నిలువునా దోసుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులకు ఇవన్నీ పట్టకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు తొండ ఐకేపీ సెంటర్లు సందర్శించి గత నాలుగు రోజులుగా వేసినటువంటి కాంటాల్ని పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల వద్ద అదనంగా తీసుకున్న ధాన్యానికి డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎల్లంల యాదగిరి, సీపీఐ మండల కార్యదర్శి తిప్పి రాల శ్రీకాంత్, ఎండీ ఇక్బాల్, కనుక అశోక్, భూతం రవి, బండారు నారాయణ, తదితరులు పాల్గొన్నారు.