- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిబ్బంది ధర్నా
దిశ, నల్గొండ: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. జీతాలు సరిగా రావడం లేదని వచ్చిన జీతాలు కూడా తక్కువ వస్తున్నాయని, ఆర్అండ్‌బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నటువంటి సిబ్బంది శానిటైజేషన్ వర్కర్లు, పేషంట్ కేర్ వర్కర్లు సెక్యూరిటీల జీతాలు పెంచాలంటూ ఏజెన్సీ మీద మంత్రికి ఫిర్యాదు చేశఆరు. ఈ విషయమై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించి వారి జీతాలను వెంటనే పెంచాలి అని చెప్పి ఇప్పుడు ఇస్తున్న జీతాల కంటే మెరుగ్గా జీవో 60 ప్రకారం వారి జీతాలను అందజేయాలని అప్పటి సూపర్డెంట్ లచ్చు నాయక్‌కి, ఏజెన్సీయాజమాన్యానికి తెలిపారు. కానీ ఈ సాయి ఏజెన్సీ దానిని అమలు చేయలేదని సిబ్బంది ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఏజెన్సీ యాజమాన్యంపై మంత్రికి ఫిర్యాదు చేయడం వల్ల నే పేర్లు తొలిగించారని ఆరోపించారు. మనోవేదనకు గురై వారి పేర్లు రికార్డులో లేకపోవడం వల్ల వారిని తొలగించినట్లు వల్ల సూపర్వైసర్ వాళ్లకి తెలపడం వల్ల వాళ్ళు ఆత్మనూన్యతకు గురై సిబ్బందితో కలిసి మూకుమ్మడిగా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. పేషంట్ కేర్, శానిటేషన్ వర్కర్లు మాట్లాడుతూ… ఒకవేళ అనుకోకుండా ఓ రెండు, మూడు రోజులు రాలేని పరిస్థితి ఉంటే జీతాలలో ఎక్కువ శాతం కట్ చేస్తున్నారని మాకు ఇచ్చే పీఎఫ్‌లలో కూడా చాలా తేడా ఉందని జీవో 60 ను పాటించకుండా జీతాలు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. అలాగే అక్కడ పని చేస్తున్నటువంటి సిబ్బంది పైన చాలా రోజులుగా ఈ యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తూ పని చేసుకుంటున్నట్లు తెలిపారు.
ముగ్గురు సిబ్బంది ఆత్మహత్యాయత్నం:
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏజెన్సీ వారు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ, ఉద్యోగం నుంచి తొలగించారని, ఆస్పత్రి ముందు ధర్నా చేస్తున్న సమయంలో కొన్ని గుర్తు తెలియని మాత్రలు మింగి అపస్మార స్థితిలోకి వెళ్లారు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే వారిని అదే ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స చేస్తున్నారు. సుమారు రెండు గంటలుగా ధర్నా చేస్తున్నప్పటికీ ఉన్నత అధికారులు వచ్చి వారి సమస్య పట్టించుకోకపోవడం వల్ల ఈ ఆత్మహత్యయత్నానికి వారు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
Read More..