- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఎంసీ చైర్మన్ ఎవరికో.. 6 మందికి పైగా ఆశావహులు
దిశ, గంభీరావుపేట : గంభీరావుపేట మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ చైర్మన్ పదవి కాలం గత సంవత్సరం డిసెంబర్‌లో ముగిసిన విషయం విదితమే..కాగా, ఈ పదవి రేసుకి ఇపుడు 6 మంది ఆశావాహులు ఉన్నారు. ప్రస్తుతం ఏఎంసి చైర్మన్ జనరల్ కు రిజర్వు కావడంతో ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది. ఆశావాహుల్లో ప్రస్తుత బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గాంధాడెపు రాజు, ఉద్యమ కాలం నుండి జేఏసీ చైర్మన్‌గా గంభీరావుపేట పట్టణ అధ్యక్షులుగా పనిచేసే ఇంతవరకు ఏ పదవి ఆశించలేదు. ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ కు ముందు వరుసలో ఉన్నారు. ఇతనికి నాస్కాబ్ చైర్మన్ రవీందర్రావు , బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆశీస్సులు ఉన్నాయి. గతంలో ఎంపీటీసీ పనిచేసిన లింగం యాదవ్ కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకుగాను , యాదవ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకుని దగ్గరికి తీసుకోవాలని ఆలోచనలు ఉన్న లింగం యాదవ్ కు కూడా అవకాశాలు ఉన్నాయి.
మాజీ ఎంపీటీసీ కమలాకర్ రెడ్డి గతంలో తను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన నేనున్నాను అంటూ వెంటనే సమస్యలకు స్పందించేవాడు తెలంగాణ ఉద్యమంలో తనదైన స్టైల్ లో పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిగా గుర్తింపు, బీఆర్ఎస్ యువజన నాయకులు గడ్డమీద శ్రీకాంత్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు లక్కిరెడ్డి లతా రెడ్డి, బీఆర్ఎస్ యువజన నాయకులు అభిలాష్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో ఇప్పటికప్పుడు అందిస్తూ ఉంటాడు. అలాగే గంభీరావుపేట రైతుబంధు కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న బాలకిషన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వారే అన్నట్లు మంత్రి కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మాజీ చైర్మన్ సుతారి బాలవ్వకు నే మరోమారు ఏఎంసి చైర్మన్ వరించనున్నట్లు మండలం లో చర్చలు జరుగుతున్నాయి.కేటీఆర్ కూడా సదరు నాయకుని పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది.