- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

దిశ, చిలుకూరు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ఈ విషయమై ఆ సంఘాల నాయకులు చిలుకూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండానే టీజీపీఎస్సీ తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేస్తూ మాదిగ ఉప కులాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, విఫలమైన పక్షాన కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతామని నాయకులు అన్నారు. దీక్షల్లో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు వడ్డేపల్లి కోటేశ్ మాదిగ, సిద్దెల శ్రీను మాదిగ, రాములు, మల్లెపంగు సూరిబాబు, మేరిగ రామారావు, కాంపాటి గురవయ్య, నాగరాజు, ముదిగొండ బాలు, కందుకూరి పెద్ద వెంకటేశ్వర్లు, శ్రీను, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.