సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు కృషి

by Naveena |
సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు కృషి
X

దిశ, మిర్యాలగూడ : భారత దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా..ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అణగారిన వర్గాల హక్కుల కోసం జ్యోతి రావు పూలే గారితో కలిసి ఎంతోమందికి విద్యను అందించిన మహనీయులని కొనియాడారు. మన దేశంలో మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేసి నేటికీ ఎంతో మంది మహిళలకు ఆదర్శనీయమయ్యారని పేర్కొన్నారు. పూలే ఇద్దరు దంపతులు సమాజంలో విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ..ఏన్నో పాఠశాలను ప్రారంభించి ప్రతిఒక్కరికీ అక్షర జ్ఞానం చేసారని, అలాంటి మహానియురాలిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, తరిగొప్పుల సైదులు, గుండు నరేందర్, బెజ్జం సాయి, చిలుకూరు బాలు తదితరులు పాల్గొన్నారు.

పూలేకు నివాళులర్పించిన సబ్ కలెక్టర్

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ తో కలిసి నివాళులర్పించారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, తహసిల్దార్ హరిబాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed