- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ ఉత్తర్వులను లెక్కచేయాని సర్కార్ వైద్య సిబ్బంది
దిశ, ఆలేరు రూరల్: ఆలేరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గత పది రోజుల నుండి గర్భిణీలకు ప్రసూతి సేవలు బంద్ అయ్యాయి. దీంతో చేసేదేంలేక గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని గర్భిణీ స్త్రీల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆలేరు మున్సిపాలిటీకి చెందిన కర్రే రమకు నెలలు నిండడంతో ప్రసవం కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్ళింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది గత పది రోజుల నుండి ప్రసవాలు చేయడం లేదని తెలుపడంతో తప్పని పరిస్థితిలో ఆమె కుటుంబ సభ్యులు ఆమె ను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేవిధంగా మరో ముగ్గురు గర్భిణీలు ప్రసవాల కోసం వచ్చి తిరిగి వెళ్లిపోయారు.
ప్రతి నెల 30 ప్రసవాలు చేయాల్సిందే
ప్రభుత్వ నిబంధన మేరకు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రతినెల సగటున 30 ప్రసవాలు చేయాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ ఆసుపత్రిలో అంత మేర ప్రసవాలు జరగడం లేదు. ఈ విషయమై గతంలో జిల్లా స్థాయిలో జరిగిన వైద్య ఆరోగ్య సమీక్ష సమావేశంలో అప్పటి కలెక్టర్ ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రసవాల సంఖ్య తగ్గిందని ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆస్పత్రిలో ప్రసవాలు అంత మేర జరగడం లేదు.
పెచ్చులూడుతున్న ఆపరేషన్ థియేటర్ పైకప్పు
ఆపరేషన్ థియేటర్ పైకప్పు పెచ్చులు ఊడి తరచూ కిందపడుతునట్లు తెలిసింది. ఈ కారణంగానే గత పది రోజులుగా ఆసుపత్రిలో ప్రసూతి సేవలు నిలిచిపోయినట్లు సిబ్బంది ద్వారా తెలిసింది. ఈ విషయమై ఆస్పత్రి సూపర్ండెంట్ డాక్టర్ నిఖిలను ఫోన్లో వివరణ కోరగా తాను బిజీగా ఉన్నట్లు తెలిపింది.