BSP గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా రుద్రవరం సునీల్

by Disha News Web Desk |   ( Updated:2022-01-27 10:55:56.0  )
BSP గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా రుద్రవరం సునీల్
X

దిశ, చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రుద్రవరం సునీల్ బహుజన్ సమాజ్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. BSP రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ సునీల్‌కు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తెలంగాణలో బహుజనుల ఐక్యతకు కృషి చేసి, బహుజన రాజ్య స్థాపన కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. నాపై నమ్మకం ఉంచి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన, చీఫ్ కో- ఆర్డినేటర్ Dr.RS. ప్రవీణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed