- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ రేవంత్ రెడ్డి’
దిశ, నకిరేకల్ : బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. పీసీసీ అధ్యక్ష పదవిని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న రాజకీయ దొంగ రేవంత్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో 12 సీట్లు బిఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని తెలిపారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీలో నాయకులే నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు. నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలుకెళ్లిన వ్యక్తి నల్లగొండలో నిర్వహించిన నిరుద్యోగ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ మీద మాట్లాడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించడంతోపాటు బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి పై పీసీసీ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు చేపట్టిన కేసీఆర్ దేశానికి ఆదర్శమన్నారు. చిల్లర మాటలు మాట్లాడితే నల్లగొండ జిల్లా ప్రజలు సహించరన్నారు. ఎంతమంది బలగం బలం ఉన్న కాంగ్రెస్ నాయకుల తీరు కుక్కతో ఒక వంకరలా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధగోని ధనలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.