- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబుజా సిమెంట్ కంపెనీని రద్దు చేయాలని తమ్మినేనికి వినతి..
దిశ, రామన్నపేట : రామన్నపేట-కొమ్మాయిగూడెం పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంటు కంపెనీని రద్దు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సీపీఎం నాయకులు అందజేశారు. చౌటుప్పల్ లో జరుగుతున్న సీపీఎం మూడవ జిల్లా మహాసభల సందర్భంగా హాజరైన వీరభద్రంకు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్యలు వినతి ఇచ్చి మాట్లాడుతూ... ప్రజలకు హాని కలిగించే కాలుష్య పరిశ్రమను ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జరిగే అసెంబ్లీ సమావేశాలలోనే పరిశ్రమ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్ కూరెళ్ల నరసింహచారి, కల్లూరి నాగేష్ మండల కమిటీ సభ్యులు నాగటి ఉపేందర్ ఎండి రషీద్, గొరిగె సోములు, మేడి గణేష్, నాయకులు నీల ఐలయ్య , మూశం నరహరి, శానగొండ వెంకటేశ్వర్లు, గోగులింగస్వామి తదితరులు ఉన్నారు.