- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Degree College : నాంపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాస్తారోకో..
దిశ, మర్రిగూడ : నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని శనివారం బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖి మాట్లాడుతూ ఇంటర్ విద్య తర్వాత దూర ప్రాంతాలకి వెళ్లి చదువుకోలేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, వృత్తివిద్యా కోర్సులకు సంబంచిన కళాశాలలు ఏర్పాటు చేసి నాంపల్లి విద్యార్థుల భవిష్యత్తుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ మాట్లాడుతూ పూర్తిగా గ్రామీణ ప్రాంతం, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పై చదువుల కోసం మాల్, దేవరకొండ, నల్గొండ, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి చదవలేక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సహకరించగలరని కోరారు. మండల నాయకులుగా చెలామణి అవుతున్న బడా నాయకులు ఈ న్యాయమైన డిమాండ్ల సాధనకు సహకరించాలని కోరారు. సహకరించని యెడల స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఊర్లో 20 నుంచి 30 నామినేషన్ లు వేసి వారిని రాజకీయ సమాధి చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిరుమామిళ్ల గిరి, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, పొలగోని శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిలు శివ గౌడ్, మేకల శ్రీకాంత్, స్వామి, ధరమ్ సింగ్, శ్రీకాంత్, శ్రీధర్ రెడ్డి, శివ, లవకుమార్, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.