- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రసాబాసాగా సర్వసభ్య సమావేశం
దిశ, కోదాడ:కోదాడ మండల పరిధిలోని యర్రవరం సహకార సంఘ సర్వసభ్య సమావేశం రసాబాసాగా నిర్వహించి మధ్యలోనే వాయిదా వేశారు. సోమవారం గ్రామం లోని పిఎసిఎస్ కార్యాలయ ఆవరణలో సహకార సంఘ సమావేశం..ఎసిఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. రైతులందరూ సంఘ చైర్మన్ అవినీతిని ఎండగడుతూ నిలదీశారు. సంఘ సభ్యులకు అనుమతి లేకుండా సిఈఓ ని బెదిరించి నాలుగు లక్షల రూపాయలు వాడుకోవడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులందరూ ఆందోళన చేస్తూ తక్షణమే చైర్మన్ తొలగించవలసిందిగా కోరుతూ ఎగ్జిక్యూటివ్ బాడీ కి విన్నపం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని సంఘంలోని తప్పులను సరిదిద్ది బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే పై అధికారులు స్పందించి చైర్మన్ ను డీఫాల్ట్ చేయాలని ఆందోళన చేశారు. ఆ క్రమంలో ఆందోళన ఉదృతం కావడంతో..పోలీసులు సమావేశం వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.