Minister Uttam Kumar Reddy : పెండింగ్ ప్రాజెక్టు పనుల రివ్యూ సమావేశానికి మంత్రి..

by Sumithra |
Minister Uttam Kumar Reddy : పెండింగ్ ప్రాజెక్టు పనుల రివ్యూ సమావేశానికి మంత్రి..
X

దిశ, డిండి : దేవరకొండ నియోజకవర్గంలో ఆదివారం పెండింగ్ ప్రాజెక్టు పనుల పై రివ్యూ సమావేశానికి ముఖ్యఅతిథిగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూల బొకేలు, శాలువాలతో సత్కరించారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, కలెక్టర్ సి.నారాయణరెడ్డిలు ఉన్నారు. స్వాగతం పలికిన వారిలో దేవరకొండ, మునుగోడు శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, పలు శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామీణ స్థాయి నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story