గ్రామాల్లో బెల్ట్‌ షాప్‌ల జోరు..ఏరులై పారుతున్న మద్యం

by Mahesh |
గ్రామాల్లో బెల్ట్‌ షాప్‌ల జోరు..ఏరులై పారుతున్న మద్యం
X

దిశ, నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు రాత్రింబవళ్లు మత్తులో జోగుతున్నాయి.పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు రాత్రింబవళ్లు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా ఎక్సైజ్ అధికారులు వ్యవవహరిస్తున్నారని పల్లె ప్రజలంటున్నారు. తాగేందుకు బుక్కెడు నీరు లేని పల్లెలు ఉన్నాయి… కానీ మందు దొరకని పల్లెలు మాత్రం ఒక్కటి లేదు. పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది బెల్ట్ షాప్‌లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధి పాలవుతున్నాయి.

ప్రతి కిరాణా కొట్టులో..

గ్రామాల్లో పేరుకు కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. సొంత ఇళ్లలో పెద్ద ఫ్రిడ్జ్ లు ఏర్పాటు చేసుకుని బీర్లు విక్రయిస్తున్నారు. వైన్‌షాపుల యజమానులు ఆటోల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పంపించి అమ్ముతున్నారు. మద్యం తాగి చాలామంది ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపుల కారణంగా మద్యం ఏరులై పారుతోంది.

ఎనీ టైం మందు..

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు ,పెద్దవూర ,నిడమనూరు ,తిరుమలగిరి సాగర్ ,అనుముల త్రిపురారం,మండలాలు ఉన్నాయి. బెల్ట్ షాపులన్నీ ఎనీ టైం మందు అనే పద్ధతిలో నడుస్తున్నాయి. మద్యం దుకాణాలు మూసిన తర్వాత తెల్లవారుజాము 2 నుంచి 3 గంటల వరకు మందుబాబులకు మద్యం దొరుకుతోంది. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో మద్యాన్ని అమ్ముతున్నారు. తలుపు తట్టి పలానా వాడిని వచ్చానంటే ఏ టైంలోనైనా మద్యం ఇస్తున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం మద్యం వ్యాపారులు కొత్తదారులను వెతుకుతున్నారు.

తెల్లవారుజామున గ్రామాల్లో తిరిగి బెల్టాపులకు మద్యాన్ని డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే కాకుండా బెల్ట్ షాప్ నిర్వాహకులకు మద్యం వ్యాపారులు కొత్తగా అప్పులు ఇచ్చి మద్యం అమ్ముతున్నట్లు సమాచారం. అన్ని సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుని మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

ఎమ్మార్పీకి మించి ధరలు..

వైన్ షాపు నిర్వాహకులు ఎమ్మార్పీకి మించి క్వార్టర్ పై, బీర్ బాటిల్ పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.80 పెంచి బెల్టు షాపులకు విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ రూల్స్ ధిక్కరించి వైన్ షాపులో నిర్వాహకులు ఎమ్మార్పీకి మించి బెల్టు షాపులకు మద్యం అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

బెల్టు షాపుల వారు అదనంగా..

దీంతో పాటు బెల్టు షాపుల వారు అదనంగా మరో రూ.20 పెంచి కస్టమర్లకు విక్రయిస్తున్నారు. విచ్చలవిడిగా పెరుగుతున్న బెల్ట్ షాపు నిర్వాహకులు ఎవరికి నచ్చిన విధంగా వారు ధర నిర్ణయించుకొని క్వార్టర్ పై 30/-రూ. లు, హాఫ్ పై 60/- రూ. లు ఫుల్ పై కనీసం 120/- రూ. లు బీర్ పై 50/-రూ.లు అదనంగా వసూలు చేస్తున్నారు. వైన్ షాప్ లో ఉండే ప్రతి ఒక బ్రాండ్ మద్యం బెల్ట్ షాపుల్లో ఉండటం గమనార్హం. ప్రతి ఒక్క గ్రామంలో గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలవటంలో ఆంతర్యమేంటో అర్థం కాని పరిస్థితి.పుట్టగొడుగుల్లా బెల్ట్‌ దుకాణాలు వెలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధిక ధరలే కాకుండా ఖాతా బుక్ పెట్టి వడ్డీ వసూలు కూడా చేస్తున్నారు అని వారి కుటుంబ సభ్యులు వాపోతున్నారు దీనివలన అనేక మంది బెల్ట్‌ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి తాగడం తో కాపురాలు వీధి పాలవుతున్నాయి.ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నత ఆఫీసర్లు గ్రామాల్లో బెల్ట్ షాపుల మూసివేత దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story