విద్యార్థులతో ప్రిన్సిపాల్ అసభ్య పదజాలం....స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

by Kalyani |
విద్యార్థులతో ప్రిన్సిపాల్ అసభ్య పదజాలం....స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
X

దిశ , సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాఠాలు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ నిత్యం విద్యార్థులను బూతులు తిడుతుంటాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులతో పాటు పి డి ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తూ పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు ప్రతిరోజూ ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. విద్యార్థులను చైతన్యవంతం చేయడంలో ముందుండాలి గాని తన నోటికి వచ్చినట్టు ప్రిన్సిపాల్ బూతులు, దుర్భాషలాడటం తగదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాఠశాల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి తల్లిదండ్రులకు,నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ సంఘటన పై జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా స్కూల్ లో జరిగిన సంఘటన పై ప్రిన్సిపాల్ ని వివరణ కోసం స్కూల్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రయత్నం చేయగా, ప్రిన్సిపాల్ వారితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Next Story

Most Viewed