అసమర్ధ మంత్రులు..నిదర్శనం సాగర్ ఎడమ కాలువ మరమ్మతులు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
అసమర్ధ మంత్రులు..నిదర్శనం సాగర్ ఎడమ కాలువ మరమ్మతులు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు దద్దమ్మలాగా ఉన్నారని..ఇందుకు నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండి మరమ్మతు పనుల ఆలస్యమే నిదర్శనమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణ గోదావరి నీళ్ల విషయంలో ఇద్దరు మంత్రులకు అవగాహన లేదని..మంత్రుల నిర్లక్ష్యంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయని, మన పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశతో.. నాగార్జునసాగర్ కెనాల్ కు రెండు చోట్ల గండి పడిందన్నారు. మేము ఖమ్మంకు నీళ్లు తీసుకుపోవద్దు అనట్లేదని..నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంతో పాటు మన జిల్లాకు కూడా నీళ్లు అందించామన్నారు. మా హయాంలో సాగర్ కాలువకు గండి పడితే ఏడు రోజుల్లో పూర్తి చేశామని.. ఇప్పుడు 20 రోజులైనా దిక్కు లేదన్నారు. జిల్లా మంత్రులకు అక్రమ సంపాదన, బ్లాక్ బ్లాక్మెయిలింగ్ తప్ప.. పరిపాలన మీద సోయలేదన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులే.. ఈ తొమ్మిది నెలలో పునరావృతమవుతున్నాయని ఆరోపించారు.

గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిపాలన పడకేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు తిరోగమనంలో నడుపుతున్నారన్నారు. ఉన్న వ్యవస్థలను నాశనం చేసి.. తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడేలా చేస్తున్నారని..ఉన్నవి కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే ఆలోచన, తెలివి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. మీరు తెచ్చిన జీవో 33 వలన సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందని..సుప్రీంకోర్టు చంపకాయి వేసి అందరికి అవకాశం కల్పించాలని చెప్పిన.. నాలుగు రోజులైనా కౌన్సిలింగ్ ప్రారంభించలేదని, ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో చేరే విద్యార్థు అవకాశం కల్పిస్తారా..? లేదా..? అని చెప్పడం లేదని మండిపడ్డారు. గత పదేళ్ల పాలనలో 1000కి పైగా గురుకులాలు,30కి పైగా మెడికల్ కాలేజీలు కేసీఆర్ నాయకత్వంలో ఏ రకంగా ప్రారంభించబడ్డాయో ప్రజలు చూశారన్నారు.

రాష్ట్రంలో అప్పుడే పోలీసు రాజ్యం మొదలుపెట్టి పెట్టిండ్రని, వాళ్ల తప్పులపై ప్రశ్నించినా..సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లా ఎస్పీతోపాటు ఇతర పోలీసు అధికారులకు చెప్తున్నానని.. మీరు నిబంధనలను అతిక్రమించి చిన్న తప్పు చేసిన శిక్షకు అర్హులని, చట్ట ప్రకారమే పనిచేయండని..మంత్రుల ఎమ్మెల్యేలు హుకుం జారీ చేస్తే తప్పుడు కేసులు పెడతామంటే ఊరుకోబోమన్నారు. జిల్లా మంత్రులకు ప్రతిపక్షాలపై కేసులు పెట్టించడం తప్ప వేరే పని ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అమలు చేయాలని, వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed