- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలు పరిష్కరించాలి
దిశ, యాదాద్రి కలెక్టరేట్: యాదాద్రి భువనగిరి జిల్లాలో వివిధ మండల స్థాయిలో దీర్ఘకాలంగా నిలిచిపోయిన ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని శక్తి మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్తాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సుమారు సంవత్సర కాలంగా వివిధ భూ సమస్యల పై రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటికీ వాటికి పరిష్కారం చూపలేదన్నారు. నూతన ప్రభుత్వం ధరణి సమస్యల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినప్పటికీ పిడిసి (పాస్ బుక్ డేటా కరెక్షన్ )సంబంధిత సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయన్నారు. మీరు చొరవ చూపి సత్వరమే రైతులకు విముక్తి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక కన్వీనర్ బట్టు రాంచంద్రయ్య, భువనగిరి మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ ఈరపాక నర్సింహా, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇటుకల దేవేందర్, జిల్లా ఎస్సీఎస్‌టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు సురుపంగ శివలింగం, రిటైర్డ్ ఎంఈఓ బండారు రవివర్దన్, నాయకులు గ్యాస్ చిన్న, శివ, పిట్టల బాలరాజు పాల్గొన్నారు.