Pulicinthala : పులిచింతలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

by Sumithra |
Pulicinthala : పులిచింతలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..
X

దిశ, చింతలపాలెం : పులిచింతల విద్యుత్ కేంద్రం నుండి తెలంగాణ జెన్ కో అధికారులు పూర్తి సామర్థ్యం 120 మెగావాట్లు కాగా మొత్తం నాలుగు యూనిట్ల నుంచి 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం నిండితే పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఎస్ఈ దేశ్యానాయక్ తెలిపారు. విద్యుత్ ఉత్పాదన కోసం 12,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు వరకు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 35.3723 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను ఇప్పటి వరకు నీటిమట్టం 167.846 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 2,30,354 క్యూసెక్కులు కాగా 11 ప్రాజెక్టు రేడియల్ గేట్లు ఎత్తి 2,30,473 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Next Story