- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nagarjuna sagar : కృష్ణమ్మ అందాల కనువిందు.. పర్యాటకుల సందడి..
దిశ, నాగార్జునసాగర్ : బిరా బిరా మంటూ పరిగెడుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు అందంగా కృష్ణమ్మ పరవళ్లు పెడుతుండడాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. నాగార్జున సాగర్ 26 గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. పాలనురగలా స్పీల్ వే గుండా కృష్ణమ్మ పరవళ్లు తోక్కుతోంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జలసోయగాలు వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ జళకళను సంతరించుకుంది.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 22 క్రస్ట్‌గేట్లను 5 అడుగులు, 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,67,906 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుడికాల్వ ద్వారా 8144, ఎడమ కాల్వ ద్వారా 8193, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,501, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 మొత్తం ఔట్‌ఫ్లోగా 3,14,544 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 3,94,683 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగలకు చేరింది. నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలకు 295.58 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టులో 42.16 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 2,54,698 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుండగా ఆరు గేట్ల ద్వారా 2,42,601 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పవర్ జనరేషన్ ద్వారా 12వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.
పర్యటకుల సందడి..
నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో సాగర్ నిండుకుండలా మారి, ఆహ్లాదం పంచుతోంది. ఇటు గేట్ల నుంచి పాలధారల్లా దూకుతున్న కృష్ణమ్మ కనువిందు చేస్తోంది. మరో దిక్కు సాగర్ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం సందర్శకుల మదిని దోచుకుంటోంది. సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. రోడ్ల పై ఎక్కడ చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో ఆ జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో డ్యాం పరిసరాలు పర్యాటకులతో సందడిగా మారాయి.
దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. సాగర్ అందాలను తిలకించడానికి పర్యాటకులు సాగర్ కు వస్తున్నారు. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు, బుద్ధ వనం, కొత్త వంతెన, పాత వంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. హిల్‌కాలనీ విజయవిహార్ అతిథి గృహం వెనక ఉన్న నూతన లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పులను పర్యాటక శాఖ నడుపుతోంది. పర్యాటకుల సందడితో నాగార్జునసాగర్ ప్రాంతం సందడిగా ఉన్నది. అందుకు తగ్గట్లుగా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.