లేడీ కానిస్టేబుల్‌తో ఎస్ఐ ఎఫైర్? నా చావుకు అనుమతి ఇవ్వండని ఎస్ఐ భార్య దరఖాస్తు!

by Naveena |
లేడీ కానిస్టేబుల్‌తో ఎస్ఐ ఎఫైర్? నా చావుకు అనుమతి ఇవ్వండని ఎస్ఐ భార్య దరఖాస్తు!
X

దిశ, నల్లగొండ: తను చనిపోతానని, తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి ప్లీజ్.. అంటూ ఓ మహిళ నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో నిరసన తెలిపింది. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తన భర్త లేడీ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, నా పిల్లలను చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించడం కలకలం సృష్టిస్తోంది. మహిళ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండలో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐగా పని చేస్తున్న జాల మహేందర్ 2010 లో నార్కట్ పల్లికి చెందిన తనను వివాహం చేసుకున్నాడని జ్యోతి అనే మహిళ తెలిపింది. తమకు కవల పిల్లలుగా బాబు, పాప జన్మించారని, 2016 వరకు తమ సంసారం సాఫీగా సాగిందని వివరించింది. గత నాలుగేళ్లుగా తన భర్త ప్రవర్తనలో మార్పు రావడం, ఇంటికి సరిగా రాకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. ఈ విషయంపై ఆరా తీయగా ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపిందని వెల్లడించింది. ఆ సంబంధంపై తన భర్తను నిలదీయగా ఇద్దరు కలిసి నన్ను, నా పిల్లలను చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపించింది. మా ఫ్యామిలీ ఆస్తులను మొత్తం అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు రాసిచ్చాడని, హైదరాబాద్‌లో ఓ ఇల్లు కూడా కోనిచ్చాడని చెప్పుకొచ్చింది. వీరిద్దరి అక్రమ సంబంధంపై, బెదిరింపులపై గతంలో ఉన్న ఎస్పీలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయింది. అందుకే కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తానని జ్యోతి తెలిపింది. అలాగే నేను చనిపోవడానికి కారుణ్య అనుమతి ఇవ్వాలని ఫిర్యాదులో కోరింది. చనిపోయిన తర్వాత తన శరీర అవయవాలు ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేస్తానని ఆమె తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed