రైతు పంటలపై ప్రకృతి కన్నెర్ర....

by Disha Web Desk 11 |
రైతు పంటలపై ప్రకృతి కన్నెర్ర....
X

దిశ, రాజాపేట: పంట చేతికొచ్చే సమయంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, వడగండ్ల వర్షం పడి చేతికొచ్చే పంటను మట్టిపాలు చేశాయి. పరిపంట కోతలకు ముందు వర్షాలు లేక అనేక పంటలు ఎండిపోగా, మిగిలిన పంట కోసే సమయంలో వడగండ్ల రూపంలో ఈదురు గాలులు, వర్షం రైతులను ఆవేదనకు గురి చేశాయి. మండలంలోని సింగారం, జాల,కొత్తజాల, బూరుగుపల్లి, పారుపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని వరి పంట ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వల్ల వరి గింజలు రాలిపోయి పంట నేల వాలిపోయింది.

అనేకచోట్ల మామిడికాయలు రాలిపోయి మామిడి రైతులకు తీరని నష్టం కలిగించింది. ప్రాథమిక అంచనా ప్రకారం 200 ఎకరాల్లో వరి పంట, 10 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. గతంలో కూడా పంట నష్టపరిహారం చెల్లిస్తామని చెల్లించకపోవడాన్ని రైతులు గుర్తు చేస్తారు. ఆరుగాలం శ్రమించి పెట్టిన పెట్టుబడి తో పాటు అప్పులు తీరుతాయని ఎంతో ఆశతో చూసిన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కండ్ల ముందే కావడంతో రైతు కుటుంబాల కష్టాలు, బాధలు వర్ణనాతీతం. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరకగా, వ్యవసాయ బావిల వద్ద షెడ్లు కూలిపోయాయి.

Next Story

Most Viewed