- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే...
దిశ, చౌటుప్పల్ : ముస్లింల పవిత్ర పండగ రంజాన్ పురస్కరించుకొని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చౌటుప్పల్ ఈద్గాలో శనివారం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరోపకారానికి, సహనానికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అన్నివర్గాల పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకులా మాత్రమే చూశాయని, తెలంగాణలో మాత్రమే సర్వమత సామరస్యం పరిఢవిల్లుతున్నదని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.13వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాలుకు 10ఎకరాలు కేటాయించిందని, భవన సముదాయం నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 408 మైనారిటీ గురుకుల పాఠశాలలను నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు. వక్ఫ్‌బోర్డులో నిర్మాణాలు, మరమ్మతులకు రూ.53 కోట్లు గ్రాంట్ మంజూరు చేశామని తెలిపారు. అనంతరం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ అంజయ్య, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.