Raashi Khanna : సూర్యాపేటలో సినీ నటి రాశీ ఖన్నా సందడి..

by Dishaweb |   ( Updated:2023-07-12 08:01:29.0  )
Raashi Khanna : సూర్యాపేటలో సినీ నటి రాశీ ఖన్నా సందడి..
X

దిశ, సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ను బుధవారం రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రారంభించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకలకు ప్రముఖ సినీ నటి రాశి ఖన్నా హాజరై సందడి చేశారు. సినీ నటి రాశి కన్నాను చూడటానికి ఆమె అభిమానులు, పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపెద్ద నగరాలకు వెళ్లకుండా లేటెస్ట్ డిజైన్ లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

సరికొత్త నూతన వస్త్ర ప్రపంచం నేడు సూర్యాపేట, పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఏ శుభకార్యాలకైనా షాపింగ్ అతి తక్కువ ధరలకే మాంగళ్య షాపింగ్ మాల్ లో చేయవచ్చన్నారు. ఇప్పటికే ప్రారంభించిన మాంగళ్య షాపింగ్ మాల్స్ వినియోగదారుల మన్ననలను పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు పీఎన్ మూర్తి, పుల్లూరు అరుణ్ , కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, తోడుపునూరు కార్తీక్, అరుణ్, కొల్లూరు వరుణ్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.

Read more : విషమంగా మారిన ఆరోగ్య పరిస్థితి.. తక్షణ చికిత్స మొదలు

Advertisement

Next Story