- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గాయపడిన గీత కార్మికునికి వాట్సాప్ గ్రూప్ చేయూత..
దిశ, మోత్కూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గీత కార్మికుడికి మన మోత్కూరు వాట్సాప్ గ్రూప్ ద్వారా సేకరించిన మొత్తాన్ని శనివారం సాయంత్రం అందజేశారు. ఇటీవల మున్సిపల్ కేంద్రానికి చెందిన గీత కార్మికుడు కారు పోతుల లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మన మోత్కూరు వాట్సాప్ గ్రూప్ ని ఆశ్రయించగా దాతలు, సభ్యులు అందించిన రూ. 72,700 లక్ష్మణ్ కు స్వయంగా మన మోత్కూర్ స్వచ్ఛంద సేవసంస్థ చెక్కు ద్వారా అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గనగాని నర్సింహా మాట్లాడుతూ సోషల్ మీడియాలో మన మోత్కూరు వాట్సాప్ గ్రూప్ నిరుపేదలకు ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న మన మోత్కూరు సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాట్సాప్ గ్రూపు ప్రతినిధులు దబ్బేటి సోంబాబు, కారుపోతుల వెంకన్న, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కోమటి మచ్చ గిరి, మెట్టు మంగేష్, ఎడ్ల శ్రీనివాస్, ఆరే శ్రీనివాస్, పోచం ప్రవీణ్, కోమటి జనార్ధన్, కొప్పుల రవీందర్ రెడ్డి, కారుపోతుల శ్రీను, నల్ల మధు, గుండు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.