తిరుమలగిరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

by Mahesh |
తిరుమలగిరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
X

దిశ, తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పర్యటించారు. ఈ సందర్భంగా తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం సోమవారం ఎస్సీ బాలుర వసతి గృహాన్ని నిరుపయోగంగా ఉందని తెలిసి అట్టి భవనాన్ని కళాశాల ఏర్పాటు కోసం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గెలిచిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ఉత్తర్వులను ప్రభుత్వం ద్వారా ఆమోదింప చేసి ఈ ప్రాంత విద్యార్థుల సుదీర్ఘ కలను నెరవేర్చానని అన్నారు. ఎప్పుడో ఏర్పాటు కావలసిన కళాశాలను కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మభ్యపెట్టి ఇన్నాళ్లు ఓట్లు దండుకుని రాజకీయాలు చేశారే తప్ప తమ చిత్తశుద్ధిని చాటుకోలేదన్నారు. ఈ ప్రాంత బిడ్డను కాబట్టి ఇక్కడ సమస్యలు నాకంటే ఎవరికీ ఎక్కువ తెలియదని చెప్పుకొచ్చారు.

ఆయనతోపాటు ఇంటర్మీడియట్ బోర్డు డిడి లక్ష్మారెడ్డి, డిఐఈఓ కృష్ణయ్య, జూనియర్ డైరెక్టర్ నరసింహ, సునీత్ కుమార్ తాత్కాలిక కళాశాల భవనాన్ని పరిశీలించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పలు మండలాలకు చెందిన సుమారు 100 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే విధంగా బస్ డిపో సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యేను కలిసి బస్సు డిపో ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ శాగంటి అనసూయ రాములు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వై నరేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, పాలకుర్తి రాజయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దరావత్ జిమ్మి లాల్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మూల రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్ మీడియా ఇన్ఛార్జి కందుకూరి లక్ష్మయ్య, పేరాల వీరేష్,పత్తేపురం సుధాకర్,దాచేపల్లి వెంకన్న, బత్తుల శ్రీను, వీరమల్లు గౌడ్, గిలకత్తుల రాము గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed