MLA Padmavathi Reddy : ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తాం..

by Sumithra |
MLA Padmavathi Reddy : ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తాం..
X

దిశ, అనంతగిరి/కోదాడ : ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరి మండల పరిధిలోని బొజ్జ గూడెం తండాలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని ఘనంగా సన్మానించారు. దేవాలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్స్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, కొండపల్లి వాసు, డేగ కొండయ్య, బుర్ర పుల్లారెడ్డి, ధరావత్ సైదులు, మాజీ వైస్ ఎంపీపీ ధరావత్ రాము, గునుగుంట్ల స్వరూప, శ్రీను, గ్రామస్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed