గత పాలకుల వల్లే లిఫ్టులు అధ్వానం- ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Nagam Mallesh |
గత పాలకుల వల్లే లిఫ్టులు అధ్వానం- ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, మిర్యాలగూడ : గత పాలకుల నిర్లక్ష్యం వలన నియోజకవర్గంలోని లిఫ్టులన్నీ అద్వాన స్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామరచర్ల, దున్నపోతుల గండి, కేశవపురం, తోపుచర్ల ఎత్తిపోతల పథకాలకు మోక్షం కలగనున్నట్లు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టులకు నిధులు మంజూరు కాకపోవడంతో భూములన్ని బీడుగా మారాయన్నారు. ఈనెల 11న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి సమక్షంలో ఆయా ప్రాజెక్టులకు రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సంబంధిత అధికారులు దున్నపోతుల గండి ప్రాజెక్టు వద్దకు చేరుకొని సహకరించాలని సూచించారు. నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, కొమ్ము శ్రీనివాస్, దేశి రెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed