‘మాది రైతు పక్షపాతి ప్రభుత్వం’.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘మాది రైతు పక్షపాతి ప్రభుత్వం’.. మంత్రి కోమటిరెడ్డి  కీలక వ్యాఖ్యలు
X

దిశ,నల్లగొండ: రాష్ట్రంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గత సీజన్‌లో పూర్తిగా కొనుగొలు చేయడం జరిగింది. అధికారులతో ఫాల్ అప్ చేస్తూ రైతులు అమ్ముకున్న ధాన్యానికి మూడు రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అన్నారు. రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. దొడ్డు బియ్యం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారు. అదే రోజు బోనస్ అమౌంట్ మీ అకౌంట్‌లో పడుతుంది అన్నారు. సివిల్ సప్లై మీద గతంలో కొంత అపవాదు ఉంది ఇప్పుడు అలాంటి సంఘటనలు జరుగొద్దు అన్నారు. ఇది రైతు ప్రభుత్వం అన్నారు.

రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. ఉపాధి హామీ పథకం పెట్టిన ప్రభుత్వం మాది అన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావడానికి చాలా సమయం పట్టింది. అలాగే నేడు మా ప్రభుత్వంలో మొదటి తేదీన జీతాలు ఇస్తున్నాం. హరీష్ రావు లాంటి వారికి చెప్తున్నాం 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన అన్నారు. ఈ ప్రభుత్వంలో కరెంటు బిల్లు లేదు, మహిళలకు బస్సు సౌకర్యం అలాగే 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం అన్నారు. వచ్చే మూడు నెలల్లో నల్లగొండను సాగునీటితో సస్యశ్యామలం చేసే దిశగా కాలువలు తిస్తున్నాం అన్నారు. మొదటి విడతలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నాం. డి37,40 కాలువకు నేను సొంతంగా 40 లక్షల రూపాయలు ఖర్చు చేసాను.

అందరికీ అండగా ఉంటా అన్నారు. 11 వేల మంది డీఎస్సీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం అన్నారు. 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. వెల్లెంల ప్రాజెక్టు 2 ఏండ్లలో పూర్తి చేస్తున్నాం.శ్రీశైలం ఎండిపోయే దశలో ఉన్న నల్లగొండ కు చివరి బొట్టు వరకు నీళ్లు నల్లగొండకు వస్తాయి అన్నారు. కేసీఆర్ దుర్మార్గుడు మోసం చేయడం వల్ల బ్రాహ్మణ వెల్లంల కి ఒక్క రూపాయి ఇవ్వలేదు అని అన్నారు.అందుకే ఆ దుర్మార్గుడు పాలన అంతం అయినది అన్నారు. రైతు మాత్రమే న్యాయంగా ఉంటున్నాడు అని అధికారులు ఎక్కడ ఇబ్బందులు రాకుండా రైతులను చూసుకోవాలి అన్నారు.

అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్ లో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేయడం జరిగింది అన్నారు. 375 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలి నిర్ణయం చేసాము 325 కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే స్పాట్ లను గుర్తించడం జరిగింది. 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాం. తేమ శాతం ప్రకారం కొనుగోలు వెంటనే చేసే అవకాశం ఉంటుంది అన్నారు. ఎఫ్ ఏ క్యూ నార్మ్స్ ప్రకారం కొనుగోలు చేస్తామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకు కొనుగోలు విషయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. టోల్ ఫ్రీ 9963407064 టార్పాలిన్, ట్రాన్స్పోర్ట్, కొనుగోలు విషయంలో సమస్యలు వస్తే రైతులు ఈ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేయాలని తెలిపారు. సన్నదాన్యం కి 500.రూపాయలు క్వీన్టల్ కి ఇవ్వడం జరుగుతుంది అన్నారు. సన్న ధాన్యం మనకు రాష్ట్రంలోకి రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా ఇబ్బందులకు గురి కాకుండా సన్న ధాన్యం వేరుగా కేంద్రాలను దొడ్డు ధాన్యం కి వేరే లా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు బ్యాంక్ పాస్ బుక్, పట్టాదారు పాస్ బుక్ తీసుకుని వస్తే సరిపోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story