- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు : మంత్రి జగదీశ్ రెడ్డి
దిశ,నకిరేకల్ : దేశ ప్రజల ఆకాంక్షతోనే బీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిందని, కేసీఆర్ తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు వస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మాదిరిగా 24 గంటల కరెంటు మాకెందుకు లేదని దేశ ప్రజలు మోడీని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. నకిరేకల్ మున్సిపాలిటీ ఆరో వార్డుకు చెందిన మట్టిపల్లి కవిత వీరు దంపతులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో పట్టణాలతో పాటు పల్లెల్లోనూ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వెల్లడించారు. చిరుమర్తి లింగయ్య ఏ మంత్రిని కలిసినా అభివృద్ధి పనులపై చర్చిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలోనే అత్యధిక సమయం నియోజకవర్గంలో గడిపే ఏకైక ఎమ్మెల్యే లింగయ్య అని కొనియాడారు. అనంతరం లింగయ్య మాట్లాడుతూ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గతంలో వారు చేసిన అరాచకాలను ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. స్థాయికి తగ్గట్టుగానే ఉండాలని, అనవసరంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. ముసుగు దొంగలతో పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం నకిరేకల్ నియోజకవర్గం ప్రశాంత వాతావరణంలో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ ఉమారాణి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.