చిలకయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి

by Javid Pasha |
చిలకయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, పెన్ పహాడ్: మండలంలోని మహమ్మదాపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన గ్రామ సర్పంచ్ కొండేటి రజిత మామ అయిన కొండేటి చిలకయ్య కుటుంబాన్ని బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా కొండేటి చిలకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి చిలకయ్య లేని లోటు తీరనిదని అన్నారు. చిలకయ్య కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక గ్రామ యువకులతో మాట్లాడిన మంత్రి.. త్వరలోనే గ్రామంలో ఓపెన్ జిమ్ సెంటర్ ను ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మది భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి యుగంధర్, గ్రామ సర్పంచులు బిట్టు నాగేశ్వరావు, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాతల జానకి రాoరెడ్డి, దాచేపల్లి భరత్, గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు భూక్య వీర్య నాయక్, పార్టీ నాయకులు భూక్య మురారి, బచ్చు రామనర్సయ్య, బిట్టు రమేష్, కొండేటి గోపి, వెంకన్న, గోవర్ధన్, నగేష్, సైదులు, మురళి, ఒగ్గు గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story