- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AYUSH doctor : రోగులను పక్కదారి పట్టిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది..
దిశ, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ మండలంలోని గోపాలపురం గ్రామంలో గత నెల రోజులుగా విషజ్వరాలు ప్రబలడంతో ప్రజలు రోగాల బారిన పడి అల్లాడుతున్నారని ఆ గ్రామానికి చెందిన న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు ఆదివారం విలేకరులకు తెలిపారు. నిబంధన ప్రకారంగా ఏదైనా గ్రామంలో విషజ్వరాలు విజృంభించినట్లయితే వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్ ను ఆ గ్రామానికి పంపించి రోగుల రక్త నమూనాలు సేకరించాలి. అనంతరం వాటిని జిల్లా కేంద్రానికి పరీక్ష నిమిత్తం పంపించి ఆ నివేదిక ప్రకారంగా తగిన వైద్యం అందించవలసి ఉంటుంది. కానీ గోపాలపురం గ్రామానికి ఇంతవరకు ఎటువంటి ల్యాబ్ టెక్నీషియన్ పంపడం గాని రక్త నమూనాలు సేకరించడం గాని జరగలేదని ఆయన తెలిపారు. ఆయుష్ వైద్య విభాగానికి చెందిన వారికి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, రక్త కణాల క్షీణత లాంటి రోగాల పట్ల ఎటువంటి అవగాహన ఉండదని కానీ గోపాలపురం గ్రామానికి ఒక ఆయుష్ వైద్యురాలిని పంపించి ఆమె విషజ్వరాల చికిత్సకు సరైన వైద్యురాలిగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను నమ్మించి వారిని తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నేటి వరకు ఎటువంటి రక్త నమూనాలు సేకరించకుండా ప్రైవేటు ల్యాబ్ కు వెళ్లి పరీక్షలు చేయించుకొని రమ్మని పురమాయించు తున్నారని, దాంతో రోగుల పై విపరీతమైన ఆర్థిక భారం పడి అప్పుల పాలై అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వపరంగా వైద్య పరీక్షలు నిర్వహించకుండా ప్రైవేటు ల్యాబ్ లకు పంపించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దానిలోని ఆంతర్యాన్ని ఉన్నతాధికారులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఇకనైనా వైద్యశాఖ సిబ్బంది వెంటనే స్పందించి గ్రామంలో అత్యవసర వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేసి వారిని ఆదుకోవాలని ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.