- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్రవంతిని విమర్శించే స్థాయి నీది కాదు.. మంచుకొండ సంజయ్..
దిశ, చండూరు : ఏఐసీసీ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇంచార్జీ పాల్వాయి స్రవంతిని విమర్శించే స్థాయి కోడి గిరిబాబుకు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచుకొండ సంజయ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాంధీభవంలో మేము చేసే నిరసన స్రవంతికి ఎమ్మెల్యే టికెట్ కోసం కాదని పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న కార్యకర్తలను గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్టు ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తామని అన్నారు. పార్టీని అమ్ముకునే వారికి పదవులు ఇవ్వటం వల్ల నిజాయితీ గల కార్యకర్తలు నిరాశకు గురైతున్నారని అన్నారు. ఉపఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను విమర్శించిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ప్రస్తుతం మండల అధ్యక్షుడుగా ఎన్నికైన వ్యక్తి మే నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరితే జనవరి నెలలో ఎంపిక చేసిన మండల అధ్యక్షుల జాబితాలో పేరు ఎట్ల ఉంటుందని నిలదీశారు. తనకు బిల్లులు రావటం లేదని గోవర్ధన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్న వ్యక్తి ఇప్పుడు విమర్శించడం తగదన్నారు. ఉపఎన్నికల్లో స్రవంతి ప్రతిపక్షాలనుండి డబ్బులు తీసుకున్నారన్న పుకార్లు వాస్తవం కాదని, ఈ విషయంలో ఆమె ఇప్పటికే భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేసారని అన్నారు. ఉపఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలు పెట్టిన పార్టీకోసం పనిచేసామని అంటూనే మూడు కండువాలు కప్పుకున్న వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చలమల్ల కృష్ణా రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పన్నాల లింగయ్య, నేర్లలకంటి రవికుమార్, మేకల సాగర్ రెడ్డి, కట్ట అంజయ్య, సోము లింగస్వామి, పన్నాల శ్యామ్ నరేందర్, కట్ట సైదులు తదితరులు పాల్గొన్నారు.