- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Protest : ఆటో రిక్షా కార్మికుల మహాధర్నా
దిశ, చౌటుప్పల్ టౌన్: భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆటో కార్మికులు నిరసన ప్రదర్శన, మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ ఆందోల్ మైసమ్మ లోకల్ ఆటో కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో.. ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు చౌటుప్పల్ కు మూకుమ్మడిగా తరలివచ్చి నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు పాండాల మల్లేష్, ఉపాధ్యక్షుడు మానుపాటి వెంకటేష్, కార్యదర్శి బూడిద ఎట్టయ్య, కాసాని కుమార్, కోళ్ల శ్రీనివాస్, బండ సంజీవ, రాచకొండ సైదులు, దేశట్ల లింగస్వామి, వెంకటస్వామి, ఎస్.కే.గాలిబ్ తదితరులు పాల్గొన్నారు.