- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సస్పెన్షన్ ఎత్తివేత సరే.... మరి పోస్టింగ్ మాటేమిటి....?
దిశ, యాదాద్రి కలెక్టరేట్: యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పై రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12న సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌లో 3 సంవత్సరాలకు పైగా పని చేశారని అయినా ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని, వాస్తవాలను అటకెక్కించారని ఈ నెల 4వ తేదీ సస్పెండ్ చేసిన విషయం విదితమే. అయితే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తి వేసింది కానీ పోస్టింగ్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనే అంశంపై యాదాద్రి కలెక్టరేట్ లో జోరుగా చర్చ జరుగుతోంది. సస్పెన్షన్ ఆర్డర్స్‌లో పొరపాటు జరిగి ఉంటే సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ యధావిధిగా ఎందుకు ఇవ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్ యాదాద్రికే ఇచ్చిన భాస్కర్ రావు మాత్రం యాదాద్రిలో పని చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓగా పనిచేస్తున్న పి.బెన్ షాలోము యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కలెక్టరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.