రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దాం.. పిలుపునిచ్చిన మంత్రి

by Disha News Desk |
రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దాం.. పిలుపునిచ్చిన మంత్రి
X

దిశ, హుజూర్ నగర్: ప్రజల సౌకర్యాల కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని, అభివృద్దికై అందరూ కలిసిరండి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవరి పార్టీ, ఎజెండాలు వారికుంటాయని, కానీ ఎవరిని ఎన్నుకోవాలో ప్రజల చేతుల్లో ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు హితవు పలికారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వద్ద రూ.7.25కోట్లతో నిర్మించనున్న మిని ట్యాంక్ బండ్, హుజూర్ నగర్ నుండి కరక్కాయలగూడెం వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నిధుల నుండి మంజూరైన రూ.4.1 కోట్లతో నిర్మించిన రహదారిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లతో కలిసి శనివారం ప్రారంభించారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సైదిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ సీఎం ఆదేశాలను అమలు చేస్తున్నారని తెలిపారు. హుజూర్ నగర్‌లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, పలు సందర్బాలలో సీఎం కేసీఆర్ స్వయంగా సందర్శించి.. అభివృద్ధి కోసం నిధులు కేటాయించారని అన్నారు. కాగా కొందరు చేయ లేకపోయినప్పటికీ జరుగుతున్న డెవలప్‌మెంట్‌ను కోర్టు స్టేలతో అడ్డుకోవడం మంచి విధానం కాదన్నారు. మినిట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తి అయితే హుజూర్ నగర్ పట్టణ కీర్తి మరింత పెరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈఓవీ, రమేష్ బాబు, ఎస్.ఈ నరసింహారావు, ఈఈ శ్రీనివాస్, ఆర్డివో వెంకారెడ్డి, డిఎస్పీ రఘు, సీఐ రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, ఎంపిపి గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ లు కీత జయమ్మ ధనమూర్తి, అద్దంకి సైదేశ్వర రావు, కౌన్సిలర్స్ దొంగరి మంగమ్మ, ములకలపల్లి రాంగోపి, చిలకబత్తిని సౌజన్యధనంజయ, అమరబోయిన గంగరాజు, సతీష్, గాయత్రి భాస్కర్, కొమ్ము శ్రీనివాస్,గుండా ఫణికుమార్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story