పీఎస్ లో ఉపాధి కూలీ ఫిర్యాదు.. రాజీ కోసం ముమ్మర ప్రయత్నాలు..

by Sumithra |
పీఎస్ లో ఉపాధి కూలీ ఫిర్యాదు.. రాజీ కోసం ముమ్మర ప్రయత్నాలు..
X

దిశ, మర్రిగూడ : ఎన్ఆర్ఈజీఎస్ లో సిబ్బంది ఒకరు నెలల తరబడి ఉపాధి కూలీని వేధింపులకు గురి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన పై ఇరువురి మధ్య రాజీ కుదర్చడానికి ఉపాధి హామీ సిబ్బందితో పాటు పలువురు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం నుండి రాజీకి ముమ్మర ప్రయత్నాలు చేసిన సంఘటన మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ లో పనిచేస్తున్న ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఏళ్లకు ఏండ్లుగా ఇక్కడే పనిచేయడంతో ఒక ఉపాధి కూలీకి జాబ్ కార్డు ఇప్పిస్తానని దగ్గరయ్యాడు. పనిచేయకున్నా అటెండెన్స్ వేసి డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ కూలీతో సన్నిహితంగా ఉంటూ గత కొన్ని నెలలుగా వేధింపులకు గురి చేశాడు. గత కొన్ని రోజులుగా వేధింపులు ఎక్కువ కావడంతో సదరు కూలీ పదిసార్లు వార్నింగ్ ఇచ్చినట్లు కూడా సమాచారం.

వేధింపులు తీవ్రం కావడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తరపు పెద్దమనుషులు పేర్కొంటున్నారు. మండల బాస్ కు సదరు టెక్నికల్ అసిస్టెంట్ నమ్మకస్తుడు కావడంతో కొందరు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీకి రంగంలోకి దిగి రాజీ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. తనకు ఇక నుంచి ఫోన్లు గాని వేధింపులు గాని గురి చేయనని సదరు వ్యక్తి రాజీ పత్రం పై సంతకం చేస్తే దాని పై మండల బాస్ సంతకం చేస్తే రాజీ పడతానని బాధిత కూలి చెప్పడంతో రాజి బెడిసి కొట్టింది. ఉపాధి కూలీ పై సిబ్బంది వేధింపులు గురిచేసిన సంఘటన మండల వ్యాప్తంగా కలకలం చోటుచేసుకుంది. దీని పై స్థానిక ఎస్సై పూర్తిస్థాయిలో విచారణ చేసి కేసులు నమోదు చేస్తానని బాధిత మహిళలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed