మోకాళ్లపై నిలబడి అర్ధనగ్నంగా నిరసన

by Naveena |   ( Updated:2024-12-30 11:58:00.0  )
మోకాళ్లపై నిలబడి అర్ధనగ్నంగా నిరసన
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 21 రోజుకు చేరుకున్నది. సమ్మెలో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. మోకాళ్లపై నిలబడి అర్ధనగ్నంగా నిరసన దిగారు. నిరవధిక సమ్మెకు సంఘీభావంగా ప్రగతి షీలా మహిళ సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక , CPIML పేర్ల లింగయ్య , బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తన్నీరు రాంప్రభు , బీసీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షులు దుస్స రాంబాబు, నర్సయ్య సంఘీభావం తెలుపుతూ..ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాంపంగు వెంకటేశ్వర్లు, సయ్యద్, లక్ష్మి నారాయణ,నాగలక్ష్మి, సరస్వతి, తేజ శ్రీ, హారిత ప్రసన్న, నస్రీన్ , నీల, మహేశ్వరి,రంగారవు,మురళి,కవిత, ఉపేందర్, రాజీవ్, మంగమ్మ, పద్మ, సఫియా,సరిత,ఫయాజ్, వీరాస్వామి, అంజయ్య, గారు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed